పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
KMR: పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2010-2012 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. సుమారు దశాబ్దం తర్వాత మిత్రులంతా ఒకేచోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు ఒకరి అనుభవాలను మరొకరు పంచుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు.