ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలతో చెత్త తొలగింపు

VZM: కాలువల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతిస్తున్నామని విజయనగరం మున్సిపల్ కమిషనర్ పి. నల్లనయ్య తెలిపారు. గురువారం ఆయన ఆదేశాలతో పట్టణంలోకి ప్రత్యేక పారిశుద్ధ్య బృందాలను రాకోడు నుంచి రప్పించి ప్రధాన కాలువలతో పాటు చిన్న చిన్న కాలువల్లో చెత్తను తీయించారు. సాకేటి వీధి, తదితర ప్రాంతాల్లో కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి వేశారు.