పరిశోధనలకు ప్రోత్సాహం 'ప్రయాస్'

ELR: 2025-26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి పరిశోధన ప్రాజెక్ట్ ప్రతిపాదనలను జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ఆహ్వానిస్తోంది. ఆకట్టుకునే పరిశోధన ప్రతిపాదన పంపితే జాతీయ స్థాయి నుంచి ప్రోత్సహించి బాల శాస్త్రవేత్తగా మారుస్తారు. ప్రయాస్ పథకంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9 నుంచి 11 తరగతుల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.