ఉరేసుకుని వ్యక్తి మృతి
JGL: కోరుట్ల (M) అయిలాపూర్‌కు చెందిన పుల్లవేణి రాజశేఖర్ (36) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. దుబాయ్ వెళ్లి వచ్చిన ఆయన గ్రామంలో హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మద్యం అలవాటు పడ్డ రాజశేఖర్ గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని గుట్ట వద్ద చెట్టుకు ఉరేసుకుని మృతిగా కనిపించాడు.