అంతర్వేది ఆలయానికి బయలుదేరిన పాముల
కోనసీమ: రాజోలు నియోజకవర్గం వైసీపీ కో ఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవిని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళారు. ముందుగా వేగివారిపాలెంలో దివంగత నేత, మాజీ సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.