సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ ప్రారంభం
NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపుని SI వెంకటేష్ గౌడ్, ప్రిన్సిపల్ రాజారాం సోమవారం ప్రారంభించారు. ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక క్రీడాంశాన్ని ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రామ్మోహన్ గౌడ్, కరాటి మాస్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.