పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
VSP: ఏయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు జరుగుతున్న డాక్టర్ వి.ఎస్ కృష్ణ కళాశాలను రెక్టార్ ఆచార్య పి.కింగ్, దూరవిద్య కేంద్రం సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు జరుగుతున్న విధానం ప్రత్యక్షంగా పరిశీలించారు. పరీక్షలలో అనైతిక చర్యలకు పాల్పడవద్దని విద్యార్థులకు సూచించారు.