విద్యార్థులకు పజిల్స్ పై అవగాహన

విద్యార్థులకు పజిల్స్ పై అవగాహన

NLR: కొడవలూరు గ్రామంలోని గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ అధికారి రాజేశ్వరి సోమవారం విద్యార్థులకు పజిల్స్ పై అవగాహన కల్పించారు. నిత్య జీవితంలో మనకు ఎన్నో సమస్యలు వస్తుంటాయని వాటి అన్నింటిని దాటుకుంటూ ముందుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ పై శిక్షణ ఇచ్చారు.