రేపు రాజాం పోలీసు స్టేషనులో వాహనాల వేలం: CI
VZM: రాజాం PS పరిధిలో ఇటీవల వివిధ కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలు, కార్లను మంగళవారం వేలం వేయనున్నట్లు CI ఆశోక్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉదయం 9 కు రాజాం PS లో జిల్లా ఎక్సైజ్ DC ఆధ్వర్యంలో వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్నవారు సరైన గుర్తింపు కార్డుతో పాల్గొనవచ్చునని, మరిన్ని వివరాల కోసం పోలీస్ స్టేషన్ సిబ్బందిని సంప్రదించాలన్నారు.