విశాఖ పోర్టు అధారిటీ కార్యదర్శిగా శంకర్ బాబు

విశాఖ పోర్టు అధారిటీ కార్యదర్శిగా శంకర్ బాబు

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నూతన కార్యదర్శిగా ఎం. శంకర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన మార్ముగావ్ పోర్ట్ అథారిటీలో కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు బదిలీ అయ్యిన ఆయన, బాధ్యతలు స్వీకరించే ముందు పోర్ట్ వైస్ ఛైర్మన్ రోష్ని అపరంజి కొరాటిని మర్యాదపూర్వకంగా కలుసుకోగా అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు.