భక్తి భావానికి ప్రతీకగా నిలిచిన వీరాంజనేయ స్వామి దేవస్థానం
NTR: గంపలగూడెంలోని మేడూరు గ్రామంలో ఉన్న స్వయంభూ శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం అత్యంత పురాతనమైన దేవస్థానంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయానికి ప్రతిరోజూ అనేక జిల్లాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం పొందుతున్నారు. భక్తుల విశ్వాసం ప్రకారం.. స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అన్ని కష్టాలు తొలగి, మనసులో శాంతి నెలకొంటుందని నమ్మకం ఉంది.