తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా
TPT: తిరుమల ఘాట్ రోడ్డులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపై రెండవ ఘాట్‌లోని మలుపు వద్ద ఓ కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ పమ్రాదంలో తమిళనాడుకు చెందిన భక్తులకు గాయాలయ్యయి. దీంతో వారిని తిరుమలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఘాట్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది.