ధర్మపురి శ్రీనివాసికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

ధర్మపురి శ్రీనివాసికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు

కృష్ణా: జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్ శనివారం ఉదయం గుండెపోటుతో అకాల మరణం చెందారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారావు అన్నారు. నేడు విజయవాడలో ఏఐసీసీ కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకలు పాల్గొన్నారు.