సోనియా గాంధీకి కోర్టు నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు జారీ చేసింది. పౌరసత్వం రాకముందే ఆమె 1980లో ఓటరుగా రిజిస్టర్ చేసుకున్నారంటూ ఓ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో వివరణ ఇవ్వాలని సోనియాను కోర్టు ఆదేశించింది. కాగా సోనియా 1983లో భారత పౌరసత్వం పొందారు. అంతకుముందు ఆమె ఇటలీ పౌరురాలిగా ఉన్నారు.