గోదావరిలో దూకి మహిళా ఆత్మహత్య

JGL: ఓ వివాహిత గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై ఉదయ్ కుమార్ వివరాల ప్రకారం.. ధర్మపురికి చెందిన జువ్వాజి పద్మ(55) భర్తకి కళ్లు కనిపించవు. ఉపాధి కరవై అతడు ఇంటి వద్దే ఉంటున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు.