VIDEO: కేసీ కాలువలో బాలుడు గల్లంతు
నంద్యాల పొన్నాపురం కేసీ కాలువ వద్ద చేపల వేటకు వెళ్లిన దేవనగర్‌కు చెందిన సోహెల్ (15) ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగినట్లు స్థానికులు తెలిపారు. చీకటిలో టార్చిలైట్లతో గాలింపు కొనసాగిస్తున్నామని, అధికారులు స్పందించడంలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.