మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం

మీడియా ప్రతినిధులకు మెగా ఉచిత వైద్య శిబిరం

E.G: రాజమండ్రిలో జిల్లా సమాచార శాఖ ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలు  ఆసుపత్రుల డాక్టర్లు క్యాన్సర్‌కు సంబంధించిన పరీక్ష నిర్వహించి మందులు అందజేశారు. అక్రిడేషన్‌తో సంబంధం లేకుండా మీడియా ప్రతినిధులు, కుటుంబ సభ్యులతో సహా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.