'కులగణన నిర్ణయం చరిత్రాత్మకం'

'కులగణన నిర్ణయం చరిత్రాత్మకం'

KMM: దేశ వ్యాప్తంగా జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఖమ్మం త్రీటౌన్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా త్రీటౌన్ అధ్యక్షుడు కొణతం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. జనాభా లెక్కలతో పాటే కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించడం చారిత్రాత్మకమైన నిర్ణయం అని అన్నారు.