గిద్దలూరులో మామిడి పంటను పరిశీలించిన అధికారి
ప్రకాశం: గిద్దలూరు మండలంలోని కేఎస్.పల్లి గ్రామంలో మామిడి పంటను మంగళవారం ఉద్యాన శాఖ అధికారి శ్వేత పరిశీలించారు. ఈ దశలో పూత, పిందె రాలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి రైతులకు వివరించారు. మామిడి పంటకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.