సాయి ఈశ్వర్‌కు మెరుగైన వైద్యం అందించాలి: మాజీ మంత్రి
HYD: బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ అనే యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్‌ను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. యువకుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.