ఆటో డ్రైవర్‌పై మంత్రి సవిత ఆగ్రహం
AP: సత్యసాయి జిల్లా పెనుకొండలో మద్యం సేవించి అస్తవ్యస్తంగా ఆటో నడుపుతున్న డ్రైవర్‌పై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సవిత కారును ఢీకొట్టబోయాడు. దీంతో ఆమె వెంటనే కారు నుంచి దిగి డ్రైవర్‌ను మందలించింది. అనతరం మద్యం మత్తులో ఆటో నడుపుతున్న డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.