'పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించాలి'

'పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించాలి'

SRD: పెండింగ్‌లో ఉన్న రూ. 200 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని నారాయణఖేడ్‌ MIM అధ్యక్షుడు మోహిద్‌ పటేల్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఫీజులు విడుదల చేయకపోవడంతో బీఏఎస్‌ పథకం కింద చదువుతున్న విద్యార్థులను పాఠశాల యాజమాన్యాలు తరగతులకు రానివ్వడం లేదని ఆయన తెలిపారు. దీని కారణంగా విద్యార్థులు చదువులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.