పందిని వేటాడిన కేసులో ముగ్గురు అరెస్ట్
NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు గ్రామ సమీపంలో కేసీ కెనాల్ దగ్గర అడవి పందిని వేటాడిన కేసులో ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి నాసిర్ ఝా తెలిపారు. కల్లూరి వెంకట రమణ, కల్లూరి శ్రీనివాసులు, కలడి ఈశ్వరయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్ల ఆయన పేర్కొన్నారు. వన్యప్రాణులను వేటాడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.