కాటారంలో రేషన్ బియ్యం స్వాధీనం: ఇద్దరిపై కేసు
BHPL: కాటారం మండల కేంద్రంలో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఈఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వివిధ గ్రామాల నుంచి తక్కువ ధరకు సేకరించిన సుమారు 12క్వింటాళ్ల బియ్యాన్ని రెండు ట్రాలీ వాహనాల్లో తరలించే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.