వరద బాధితులకు ఉచిత వైద్య పరీక్షలు

కామారెడ్డి పట్టణంలోని గత కొన్ని రోజుల క్రితం వరద బీభత్సంతో పలు కాలనీలు నీట మునిగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముఖ్యంగా GR కాలనీలో వరదల వల్ల ప్రజలకు వైద్య పరీక్షలు సూచించడంతో శుక్రవారం UPHC ఇస్లాంపురలోని HEO రవీందర్ సారధ్యంలో వైద్య బృందం ఉచిత వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఉన్నారు.