మోస్రాలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు
NZB: మోస్రా మండల కేంద్రంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. మోస్రా సర్పంచ్, బీజేపీ నాయకులు గుత్పే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. త్యాగాల పునాదుల మీద నిర్మాణమైన పార్టీ బీజేపీ అన్నారు. ఎందరో ఈ సిద్ధంతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు పాల్గొన్నారు