VIDEO: పొగమంచులో కోమటి చెరువు అందాలు

VIDEO: పొగమంచులో కోమటి చెరువు అందాలు

SDPT: పట్టణాన్ని మంగళవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8.30 గంటలు దాటినా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉండిపోయాడు. ప్రధాన రహదారి కనిపించకపోవడంతో 2 గంటల పాటు వాహనదారులు లైట్లు వేసుకుని ఇబ్బందులు పడ్డారు. ఈ పొగమంచులో సిద్దిపేటలోని కోమటి చెరువు అందాలు మరింత ఆహ్లాదకరంగా మారాయి. ప్రకృతి ప్రేమికులు, వాకర్స్ ఈ వాతావరణాన్ని ఆస్వాదించారు.