బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

E.G: బ్యాంకు ఖాతాలతో పాటు బీమా, పెన్షన్ సౌకర్యాలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. రాజమండ్రిలోని ఆనం కళా కేంద్రంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు నిర్వహించిన ఆర్థిక చేరిక సంతృప్తి ప్రచారం సదస్సులో ఆమె మాట్లాడారు. పీఎం సురక్ష బీమా యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.