నాగులుప్పలపాడులో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

ప్రకాశం: నాగులుప్పలపాడులో బుధవారం రాత్రి రూరల్ సీఐ శ్రీకాంత్ రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. అల్లర్లకు గొడవలకు దూరంగా ఉండాలన్నారు. మండలంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రజియా సుల్తాన్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.