కర్నూలు జిల్లా డీఈవో బదిలీ

కర్నూలు జిల్లా డీఈవో బదిలీ

KRNL: జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎల్. సుధాకర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కర్నూలు DEOగా FSC ఆధికారిగా పనిచేస్తున్న శామ్యూల్ పాల్‌ను ఆ బాధ్యతల నుండి రిలీవ్ చేసింది. సుధాకర్ ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని డైట్‌ కళాశాలలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.