ములగపూడిలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

తూ. గో: ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం ములగపూడి గ్రామంలో కొరుప్రోలు బాబ్జి నానాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వరుపులు తమ్మయ్య బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మయ్య బాబు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.