అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల సమీక్ష

అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల సమీక్ష

TG: ఖమ్మం నగరపాలికలో అభివృద్ధి పనులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, నీటిపారుదల, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మున్నేరు కరకట్టల నిర్మాణం, తీగల వంతెన, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్షించారు. రిటైనింగ్ వాల్‌కు భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.