VIDEO: ఆర్టీసీ బస్టాండ్‌లో ఆభరణాల చోరీ.. సీసీ ఫుటేజీ
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికుడి వద్ద నుంచి రూ.7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.