ముగిసిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
SKLM: శ్రీకాకుళంలోని వైసీపీ కార్యాలయంలో శనివారం మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాసు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముగిసిందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.