మహిళా డిగ్రీ కళాశాలలో ఉచిత వైద్య శిబిరం
SRD: సంగారెడ్డిలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఒక ప్రైవేట్ మెడికల్ కళాశాల సౌజన్యంతో జరిగిన ఈ శిబిరంలో వైద్యులు హాజరై, కళాశాల అధ్యాపకులకు, విద్యార్థినులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన పలు సూచనలు చేశారు.