BREAKING: కూలీలపై గోడ కూలి.. ముగ్గురు మృతి
TG: హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. టోలీచౌకిలో ఐదంతస్తుల భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగి.. ముగ్గురు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నిర్మాణ పనులు చేస్తున్న కూలీలపై గోడ కూలి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి రెస్క్యూ టీం చేరుకుంది. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.