నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ప్రకాశం: కొమరోలు మండలంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని చింతలపల్లి పీడర్ పరిధిలో మరమ్మతులు, నూతన విద్యుత్ లైన్ల పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.