ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
MBNR: భూత్పూర్ మండలం రావులపల్లి గ్రామ సర్పంచ్ శ్రీశైలం, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, వార్డ్ సభ్యులు, యువకులు, మహిళలు మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై, అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు.