VIDEO: జిల్లా కేంద్రంపై వదంతులు ఆపండి: ఎమ్మెల్యే

BPT: బాపట్ల నుంచి జిల్లా కేంద్రం తరలిపోతుందంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వదంతులను మానుకోవాలని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు హెచ్చరించారు. శనివారం బాపట్లలో ఆయన మాట్లాడుతూ.. బాపట్ల జిల్లా కేంద్రం తరలి వెళ్తే తాను పదవిలో కొనసాగనని ఆయన స్పష్టం చేశారు. బాపట్లను జిల్లా కేంద్రంగా ఉంచేందుకు తాను కట్టుబడి ఉన్నానని, ఈ విషయంలో ప్రజలకు ఆందోళన వద్దన్నారు.