నేడు ఖేడ్ లో జాబ్ మేళా
SRD: నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు ( 24న) జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా. నారాయణ తెలిపారు. ఐటీ, బ్యాంకింగ్, పారిశ్రామిక రంగాల్లో వాయిస్, నాన్ వాయిస్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 18 నుండి 30 ఏళ్ల లోపు వయస్సు ఉండి, పదో తరగతి నుండి డిగ్రీ వరకు అర్హత గల అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.