స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి

HYD: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఓ చిన్నారి నిండు ప్రాణం తీసింది. అమీర్‌పేటలోని సిస్టర్ నివేదిత స్కూల్ యాజమాన్యం వండర్‌లాలో పిల్లలతో గేమ్స్ ఆడించారు. వయసుకు మించి యాక్టివిటీస్, గేమ్స్ ఆడించడంతో సూర్యతేజ(8వ తరగతి) అనే విద్యార్థి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్కూల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు.