వైద్య విద్యార్థి ఆత్మహత్య
KNR: కరీంనగర్ ప్రతిమ వైద్య కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం అనస్తీషియా విభాగంలో చదువుతున్న శ్రీనివాస్ అనే వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ తీసుకుని తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదం సంఘటనతో కళాశాల పరిసరాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.