గీతా స్కూల్‌కు విద్యా పురస్కారం

గీతా స్కూల్‌కు విద్యా పురస్కారం

MDK: విద్యా రంగంలో విశిష్ట సేవలందిస్తున్న తూప్రాన్ గీతా స్కూల్ యాజమాన్యానికి హెచ్ఎం టీవీ, హన్స్ ఇండియ 'విద్యా పురస్కారం' లభించింది. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవార్డును అందజేశారు. దశాబ్దాలుగా మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, విలువలతో కూడిన విద్య అందించినందుకు అవార్డు లభించినట్లు కరస్పాండెంట్ రామాంజనేయులు తెలిపారు.