ESI హాస్పిటల్ నిర్మించాలని మంత్రికి వినతి
ASF: కాగజ్ నగర్‌లో నూతన ESI హాస్పిటల్ నిర్మించాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని MLA హరీష్ బాబు కోరారు. సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి పట్టణంలోని పాత ESI ఆసుపత్రి దుస్థితి గురించి వివరించారు. పాత భవనం శిథిలావస్థకు చేరిందని, అదే స్థలంలో కొత్త ESI ఆసుపత్రి నిర్మించాలన్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.