మహిళా అదృశ్యం
MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన పోటరి సుకన్య (32) అదృశ్యమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. ఈనెల 28న రాత్రి సుకన్య భర్త నగేష్‌తో గొడవ పడింది. 29న మధ్యాహ్నం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. సుకన్య కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో తండ్రి బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.