గోల్కొండ జాతర.. కిక్కిరిసిన బస్సులు

HYD: గోల్కొండ జాతరను వీక్షించేందుకు ఈరోజు ఉదయం నుంచే సికింద్రాబాద్, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఉప్పల్, మెహదీపట్నం, దిల్‌సుఖ‌్ నగర్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, మియాపూర్, జవహర్ నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సహా సెట్ విన్ బస్సుల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్ని బస్సుల పెంచాలని కోరుతున్నారు.