VIDEO: పుంగనూరులో ముందస్తు సంక్రాంతి సంబరాలు
CTR: పుంగనూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రంగవల్లులు, భోగిమంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశు కేక్ కట్ చేశారు. విద్యార్థులకు పంచి, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ ప్రాముఖ్యతను వివరించారు. సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేలా చూడాలని పేర్కొన్నారు.