కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే
E.G: అనపర్తి మండలం రామవరంలో సోమవారం సాయంత్రం కూటమి పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మూడు పార్టీల నాయకులతో మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రావాడ నాగు, శిరసపల్లి నాగేశ్వర రావు, సూర్య కుమారి, నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు.