VIDEO: వైసీపీ ర్యాలీని విజయవంతం చేయాలి: మాజీ మంత్రి
ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో బుధవారం జరిగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా జరిగే ర్యాలిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మాజీ మంత్రి నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.