40 దేశాల నుంచి 3 వేల మంది అతిథులు.. భారీ ఏర్పాట్లు
AP: విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ మైదానం వేదికగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. నగరాన్ని విద్యుద్దీపాలు, ఆకర్షణీయ ఫౌంటెన్లతో అలంకరించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. అతిథులకు నోవాటెల్ హోటల్‌లో ఆయన విందు ఇచ్చారు.